తెలంగాణలో పాత వాహనాలకు HSRP తప్పనిసరి – 2025 సెప్టెంబర్ 30 డెడ్‌లైన్
HSRP ప్లేట్ తప్పనిసరి: తెలంగాణలో పాత వాహనాల కోసం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (HSRP) తప్పనిసరి అయింది. ప్రభుత్వం సెప్టెంబర్ 30ని చివరి తేదీగా నిర్ణయించింది. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. HSRP లేకుండా రోడ్డుపై వాహనం నడిపితే కేసులు నమోదు కావచ్చు. కాబట్టి తెలంగాణ వాహనదారులు వెంటనే HSRP బుక్ చేసుకోవాలి.
HSRP అంటే ఏమిటీ?
HSRP అంటే High Security Registration Plate (హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్).
ఇది ప్రభుత్వ అధికారిక నంబర్ ప్లేట్ యానీ వాహనానికి ప్రత్యేకమైన భద్రత కలిగిన నంబర్ ప్లేట్. దీంట్లో ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి:
- అల్యూమినియం మెటల్‌తో తయారీ
- హోట స్టాంపింగ్‌తో నంబర్లు/అక్షరాలు
- ట్యాంపర్‌ప్రూఫ్ లాకింగ్ సిస్టమ్
- హోలోగ్రామ్, ప్రీ-ఇన్‌గ్రేవ్డ్ కోడ్
- RCకి లింక్ అయ్యే యూనిక్ ఐడెంటిఫికేషన్
లక్ష్యం: నకిలీ నంబర్ ప్లేట్లను నిరోధించడం, వాహన దొంగతనాలు తగ్గించడం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సులభతరం చేయడం.
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అవసరం ఎందుకు?
ఈ నిర్ణయం వల్ల పొందే ప్రయోజనాలు:
- నకిలీ నంబర్ ప్లేట్ల నివారణ
- వాహన దొంగతనాల నియంత్రణ
- రహదారి భద్రతలో మెరుగుదల
- వాహన వివరాల సమగ్రత
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిబంధన తీసుకొచ్చారు. కొత్త వాహనాలకు ఇప్పటికే HSRP అమలులో ఉంది. ఇప్పుడు పాత వాహనాలకూ ఇది తప్పనిసరి.
HSRP లేకుంటే ఏమవుతుంది?
- వాహనాన్ని అమ్మడం లేదా కొనడం సాధ్యం కాదు
- రవాణా శాఖలో పేరు మార్పు ప్రాసెస్ కుదరదు
- బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ లభించదు
- పోలీసుల చేతిలో కేసులు నమోదవుతాయి
అంతేకాకుండా, సేవలు నిలిపివేయబడతాయి అని అధికారికంగా రవాణా శాఖ ప్రకటించింది.
HSRP ప్లేట్ ఖర్చు ఎంత?
వాహనం రకాన్ని బట్టి ధర మారుతుంది:
- కనీస ధర: ₹320
- గరిష్ఠ ధర: ₹800
- ఇంటికి ఫిట్‌మెంట్ అయితే అదనపు ₹50 వరకు కన్వీనియన్స్ ఛార్జ్
- 18% GST అదనం
HSRP ప్లేట్ ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి?
Official Website: bookmyhsrp.com
ప్రాసెస్:
- వెబ్‌సైట్ ఓపెన్ చేసి “High Security Registration Plate with Colour Sticker” ఎంపిక చేయాలి
- మీ వాహన వివరాలు (RC ఆధారంగా) ఎంటర్ చేయాలి
- ఫిట్‌మెంట్ లొకేషన్ ఎంచుకోవాలి (డీలర్ వద్ద లేదా ఇంటి అడ్రస్)
- డేట్, టైమ్ స్లాట్ బుక్ చేయాలి
- ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేయాలి
- రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసి ఫిట్‌మెంట్‌కి తీసుకెళ్లాలి
వాహన డీలర్ల వద్ద ఏర్పాట్లు
- వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద HSRP అమర్చే ఏర్పాట్లు చేయాలి
- ధర వివరాలు డీలర్ వద్ద స్పష్టంగా చూపించాలి
- ఇంటికి ఫిట్‌మెంట్ కావాలంటే అదనపు ఛార్జ్ వసూలు చేయవచ్చు
తెలంగాణ ప్రజలకు కీలక సూచన
మీ వాహనం 2019లో లేదా అంతకు ముందే రిజిస్టర్ అయి ఉంటే, ఈ నిబంధన తప్పనిసరి. చివరి నిమిషంలో పరుగులు పెట్టకముందే bookmyhsrp.com వెబ్‌సైట్ ద్వారా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బుక్ చేసుకోండి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు.