Arshdeep Singh New Record: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. భువీ, బుమ్రాను దాటేశాడు
Arshdeep Singh New Record: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లపై తన స్పెల్‌తో పంజాబీ పుత్తర్ హవా చూపించాడు.
ఇంగ్లండ్‌ను షాక్‌కు గురి చేసిన అర్ష్‌దీప్
అర్ష్‌దీప్ తన మొదటి ఓవర్లలోనే ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), బెన్ డకెట్ (4)లను ఔట్ చేసి టీమిండియాకు అద్భుత ఆరంభం అందించాడు. తన వేగంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. ఈ స్పెల్‌తో అర్ష్‌దీప్ తన కెరీర్లోనే మరో అరుదైన ఘనత సాధించాడు.
భారత టీ20 చరిత్రలో కొత్త రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండగా, ఇప్పుడు అర్ష్‌దీప్ 62 మ్యాచ్‌ల్లోనే 98 వికెట్లు తీసి చాహల్ (96 వికెట్లు)ను దాటేశాడు.
చాహల్ ఈ రికార్డును సాధించేందుకు 80 మ్యాచ్‌లు ఆడగా, అర్ష్‌దీప్ తక్కువ మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
అగ్రస్థానంలో అర్ష్‌దీప్
ఈ జాబితాలో ప్రస్తుతం అర్ష్‌దీప్ 98 వికెట్లతో ముందున్నాడు. తర్వాత చాహల్ (96 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (90 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (89 వికెట్లు), హార్దిక్ పాండ్యా (89 వికెట్లు) ఉన్నారు.
భవిష్యత్తు ఆశలు
అర్ష్‌దీప్ ప్రదర్శన చూస్తే, టీమిండియా భవిష్యత్తు పేస్ అటాక్ మరింత బలపడుతుందని స్పష్టమవుతోంది. అతని స్పీడ్, లైన్-లెంగ్త్, వికెట్లు తీయగల సామర్థ్యం టీమిండియాకు ఎంతో ఉపయోగపడుతోంది.
అర్ష్‌దీప్ సింగ్ రికార్డు మాత్రమే కాకుండా, ఇంగ్లండ్‌పై టీమిండియాకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో టీమిండియా అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.