BBC Indian Sports Women of the year 2024 – విజేతలు, ముఖ్యాంశాలు
BBC Indian Sports Women of the year 2024 అవార్డును ప్రముఖ భారతీయ షూటర్ మను భాకర్ గెలుచుకున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి, ఒకే ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా మను భాకర్ రికార్డు నెలకొల్పారు.
బీబీసీ స్పోర్ట్స్ అవార్డులు 2024 – విజేతలు
1. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – మను భాకర్
- 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ.
- 2021లో బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
2. బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – అవని లేఖరా
- మూడు పారాలింపిక్ పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ.
- 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు, కాంస్య పతకాలు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించారు.
3. బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు – శీతల్ దేవి
- 18 ఏళ్ల ఆర్చర్, భారత్ తరఫున పారాలింపిక్స్‌లో మెడల్ గెలిచిన కురువృద్ధ క్రీడాకారిణి.
- 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం, 2022 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం గెలుచుకున్నారు.
4. బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – మిథాలీ రాజ్
- 18 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సేవలు అందించారు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక కాలం కెప్టెన్‌గా ఉన్న రికార్డు ఆమెదే.
5. బీబీసీ స్టార్ పెర్ఫార్మర్ 2024 అవార్డు
- తులసిమతి మురుగేశన్ (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)
- ప్రీతిపాల్ (అథ్లెట్)
6. బీబీసీ చేంజ్ మేకర్ 2024 అవార్డు
- తానియా సచ్దేవ్ (చెస్ ప్లేయర్)
- నస్రీన్ షేక్ (ఖోఖో ప్లేయర్)
అవార్డు పేరు | విజేత |
---|---|
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ | మను భాకర్ (షూటర్) |
బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ | అవని లేఖరా (పారా షూటర్) |
బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు | శీతల్ దేవి (ఆర్చర్) |
బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు | మిథాలీ రాజ్ (క్రికెట్) |
బీబీసీ స్టార్ పెర్ఫార్మర్ 2024 | తులసిమతి మురుగేశన్ (బ్యాడ్మింటన్), ప్రీతిపాల్ (అథ్లెట్) |
బీబీసీ చేంజ్ మేకర్ 2024 | తానియా సచ్దేవ్ (చెస్), నస్రీన్ షేక్ (ఖోఖో) |
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు ప్రత్యేకతలు
- 2024లో భారతీయ మహిళా క్రీడాకారిణుల ప్రతిభ, కృషిని గౌరవించేందుకు బీబీసీ ఈ అవార్డును అందిస్తోంది.
- 2020 నుంచి ప్రతి ఏడాది ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
- 2025 జనవరిలో ప్రఖ్యాత స్పోర్ట్స్ జర్నలిస్టులు, నిపుణులు ఐదుగురు ప్లేయర్లను నామినేట్ చేశారు.
- ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా అభిమానులు విజేతను ఎన్నుకున్నారు.